బీహార్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్...
By: Sankar Thu, 12 Nov 2020 3:45 PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీహార్ ఎన్నికల ఫలితాల్లో మహాఘట్ కూటమిలో ఆర్‌జేడీకి 75 సీట్లు, కాంగ్రెస్‌కు 19, మిగిలిన వారికి 16 సీట్లతో మొత్తం ఈ కూటమి 110 సీట్లను సొంతం చేసుకుంది.
అటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ 74 సీట్లతో మొత్తం 125 సీట్లు సాధించింది. దీంతో మరోసారి ఎన్డీఏ బీహార్ లో అధికారంలోకి రానుంది. అయితే.. తాజాగా..బిహార్ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎన్నికల సంఘం మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసిందని ఆరోపణలు చేశారు.
అయితే... ఇలాంటి తప్పు ఇదేం మొదటి సారి కాదని పేర్కొన్నాడు తేజస్వీ యాదవ్. 2015 ఎన్నికల్లోనూ ఇలాగే ఎన్నికల సంఘం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రజలు భారీ మెజారిటీతో మహాకూటమికి పట్టం కట్టారని...కానీ అధికారం కోసం బీజేపీ దొడ్డిదారులు వెతుక్కుందని ఆరోపించారు.