పుంజుకున్న స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగింపు
By: chandrasekar Thu, 19 Nov 2020 10:42 AM
బుధవారం పుంజుకున్న
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసింది. భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
పుంజుకొని, మంచి లాభాల్లో బుధవారం ముగిశాయి. బుధవారం ఉదయం వంద
పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమై, మధ్యాహ్నం ఒకటి, ఒకటిన్నర వరకు ఊగిసలాటల్లో కనిపించింది. మధ్యలో ఓసారి
లాభాల్లోకి వచ్చినప్పటికీ దాదాపు రెండు గంటల వరకు నష్టాల్లోనే ట్రేడ్ అయింది.
అయితే చివరి గంటలో పుంజుకున్న సెన్సెక్స్ ఆ తర్వాత అంతకంతకూ పైకి ఎగిసింది. చివరకు
200
పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
సెన్సెక్స్ 227.34 పాయింట్లు అంటే 0.52 శాతం లాభపడి 44,180.05 వద్ద, నిఫ్టీ 64.10 పాయింట్లు అంటే 0.50 శాతం ఎగిసి 12,938.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1496
షేర్లు లాభాల్లో, 1100 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 153 షేర్లలో
ఎలాంటి మార్పులేదు.
ఉదయం నష్టాల్లో
ప్రారంభమైన రూపాయి మధ్యాహ్నం 23 పైసలు ఎగబాకి 74.23 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం 74.49 వద్ద
క్లోజ్ అయింది. సెన్సెక్స్ 44,180 వద్ద క్లోజ్ అయి జీవన గరిష్టం వద్ద ముగిసింది.
నిఫ్టీ 12,938 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 9.81 శాతం, లార్సన్
6.22 శాతం, బజాజ్
ఫిన్ సర్వ్ 5.76 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 5.63 శాతం లాభాల్లో ముగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్ 2.94 శాతం, హెచ్ యూఎల్ 2.09 శాతం, ఐ టీసీ 1.76 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1.68 శాతం, టైటాన్
కంపెనీ 1.68 శాతం
నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టాటా
మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ, మహీంద్రా
అండ్ మహీంద్ర ఉన్నాయి.