భారీగా పెరుగుతున్న కోడిగుడ్ల ధరలు...
By: chandrasekar Sat, 03 Oct 2020 3:47 PM
రాష్ట్రంలో కోడిగుడ్ల
ధరలు భారీగా పెరుగుతున్నాయి. కోడి గుడ్ల ధరలు పెరిగిపోతున్నాయి. చలి కాలం
వస్తుండటంతో కోడి గుడ్ల వినియోగం కూడా పెరిగిపోతోంది. ఎగ్స్‌లో చాలా ప్రొటీన్లు
ఉంటాయి. దీంతో చాలా మంది గుడ్లు ఎక్కువగానే తింటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కోడి గుడ్ల
ధర కొండెక్కి కూర్చుంది. అక్టోబర్ నెలలో కోడి గుడ్ల ధర రిటైల్ మార్కెట్‌లో రూ.7 నుంచి
రూ.8 వరకు
(ఒక్కో గుడ్డుకు) చేరింది. గత వారంలో డజను గుడ్ల ధర రూ.60-65 వరకు
ఉండేది. కానీ ఇప్పుడు డజను గుడ్ల ధర రూ.80కు చేరింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా గుడ్ల
ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని గుడ్ల వ్యాపారులు పేర్కొంటున్నారు. 2021
ఫిబ్రవరి వరకు కోడి గుడ్ల ధర పెరుగుతూనే ఉండొచ్చని తెలిపారు. తగ్గే ఛాన్స్ లేదని
పేర్కొంటున్నారు. ఇప్పటికే చికెన్ ధర కూడా కొండెక్కి కూర్చుంది. కూరగాయల ధరలు కూడా
పెరిగిపోతున్నాయి. ఇందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పుడు ఉత్తర ప్రదేశ్
పౌల్ట్రీ ఫామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవాబ్ అలీ మాట్లాడుతూ చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే వదంతుల
కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో చికెన్, ఎగ్స్ తినే వారి సంఖ్య
తగ్గిందని, కానీ అవ్వన్నీ కేవలం కల్పితాలేనని తర్వాత ప్రజలు
గ్రహించారని, ఇప్పుడు మళ్లీ చికెన్, ఎగ్స్‌ను ఎక్కువగా
తింటున్నారని వివరించారు. కరోనా టైమ్‌లో కోళ్లను ఉచితంగా పంచినా ఘటనలు కూడా
జరిగాయి. అలాగే లాక్ డౌన్ కారణంగా కోళ్లకు దాన లేకపోవడంతో చాలా వరకు చనిపోయాయి.
దీంతో ఇప్పుడు చాలా ఫామ్స్‌లో సగం వరకే కోళ్లు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఎగ్స్‌కు
డిమాండ్ బాగా పెరిగింది. అయితే పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సప్లై లేదు. దీంతో
ధరలు పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ట్రెండ్
కొనసాగవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల భారం ప్రజలపై పడనుంది.