కరోనా మెడిసిన్ రెమిడీసీవీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
By: Sankar Fri, 16 Oct 2020 8:41 PM
అమెరికాలో కరోనా వైరస్ సోకిన వారి కోలుకునేందుకు రెడ్‌డిసివిర్ వాడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా చికిత్స సమయంలో ఈ డ్రగ్ తీసుకున్నారు. ఇండియాలో కూడా ఈ డ్రగ్‌ను కోవిడ్ పేషెంట్లకు ఇస్తున్నారు.
అయితే గిలీడ్ సంస్థకు చెందిన రెమ్‌డిసివిర్.. కోవిడ్ పేషెంట్లపై పెద్దగా ప్రభావం ఏమీ చూపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయాన్ని తగ్గించడంలో కానీ, కోవిడ్ నుంచి మరణాన్ని ఆపేందుకు రెమ్‌డిసివిర్ ఏమాత్రం ఉపయోగపడలేదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. యాంటీ వైరల్ డ్రగ్‌గా రెమ్‌డిసివిర్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సాలిడారిటీ ట్రయల్స్‌లో రెమ్‌డిసివిర్ ప్రభావవంతంగా లేదని నిర్ధారణకు వచ్చారు. రెమ్‌డిసివిర్‌తో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్, యాంటీ హెచ్ఐవీ డ్రగ్ లోపినావిర్-రిటోనావిర్, ఇంటర్‌ఫెరాన్ మందులకు కూడా డబ్ల్యూహెచ్‌వో ట్రయల్స్ నిర్వహించింది.
సుమారు 30 దేశాల్లోని 11266 మందికి ఈ మందులతో పరీక్షలు చేశారు. అయితే రెమ్‌డిసివిర్ వాడకం వల్ల 28 రోజుల చికిత్స కాల వ్యవధిని తగ్గించలేదని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. కానీ తమ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను డబ్ల్యూహెచ్‌వో ఇంకా తమ సైట్‌లో అప్‌లోడ్ చేయలేదు.