IIMC లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
By: chandrasekar Fri, 27 Nov 2020 10:21 PM
అసోసియేట్ ప్రొఫేసర్
మరియు అసిస్టెంట్ ప్రొఫేసర్ ఉద్యోగుల కోసం IIMC
లో నోటిఫికేషన్ విడుదల చేయబడింది. నిరుద్యోగులకు
ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC)
శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. అసోసియేట్ ప్రొఫేసర్, అసిస్టెంట్ ప్రొఫేసర్
పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు
జనవరి 15, 2021లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకోసం అర్హత, ఆసక్తి
కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించిన ఫార్మాట్లో వచ్చే ఏడాది జనవరి 15లోగా
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందుకోసం పూర్తి చేసిన
అప్లికేషన్లను office of Assistant
Registrar (Admn.), Indian Institute of Mass Communication, Aruna Asaf Ali Road,
JNU New Campus, New Delhi 110 067
చిరునామాకు పంపించాలి. అసోసియేట్ ప్రొఫెసర్ కోసం 55 శాతం మార్కులతో మాస్టర్
డిగ్రీని పూర్తి చేసి, ఎనిమిదేళ్లు టీచింగ్ లో అనుభవం ఉన్న వాళ్లు దరఖాస్తుకు
అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 55 శాతం మార్కులతో పీజీ
పూర్తి చేసిన వారు దరఖాస్తకు అర్హులు. ఇతర విద్యార్హత వివరాలను నోటిఫికేషన్లో
చూసుకోవచ్చు. దీనిని నిరుద్యోగులు వినియోగించుకోవాలి.