రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ సేల్
By: chandrasekar Thu, 25 June 2020 6:48 PM
షియోమీ రెడ్ మీ నోట్ 9 ప్రో
మ్యాక్స్ సేల్ ప్రారంభమైంది. 5020 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ, క్వాల్
కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్లను ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు
నాలుగు కెమెరాల సెటప్ ను అందించగా, ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా
పిక్సెల్ గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ సైడ్ లో ఉంది.
ఈ మధ్యనే ఈ స్మార్ట్ ఫోన్
ధర కూడా రూ.500 వరకు పెరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ లో మొత్తం మూడు
వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్,
64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్,
128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,599గానూ, 8 జీబీ
ర్యామ్, 128 జీబీ
స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గానూ ఉన్నాయి. అరోరా బ్లూ, గ్లేసియర్
వైట్, ఇంటర్
స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
అమెజాన్ ఇండియా, ఎంఐ.కాం
వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్
సభ్యులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐదు శాతం డిస్కౌంట్ ను
పొందవచ్చు. నోకాస్ట్, స్టాండర్డ్ ఈఎంఐ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రూ.298, రూ.398 అన్
లిమిటెడ్ ప్యాక్ లపై ఎయిర్ టెల్ డబుల్ డేటాను కూడా అందిస్తుంది.
ఇందులో 6.67
అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా
ఉంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
ప్రొటెక్షన్ ను ఇందులో అందించారు. ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ
ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇస్రో నావిగేషన్ సిస్టం నావిక్ ను కూడా రెడ్ మీ
నోట్ 9 ప్రో
మ్యాక్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలు
ఉన్నాయి.
దీనిలో ప్రధాన కెమెరా
సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉంది. వీటితో పాటు 8 మెగా
పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 5 మెగా
పిక్సెల్ క్వార్టెనరీ డెప్త్ సెన్సార్ లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీ ప్రియుల
కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న కెమెరా ఉంది.
బ్యాటరీ సామర్థ్యం 5,020
ఎంఏహెచ్ గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు.
దీంతోపాటు 4జీ వోల్టే, వైఫై 802.11ac,
బ్లూటూత్ v5.0,
ఇన్ ఫ్రారెడ్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం
హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ 0.88
మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.