చైనా వస్తువులు ఎక్కువ అమ్మడానికి గల కారణాలు
By: chandrasekar Mon, 26 Oct 2020 6:29 PM
మన దేశంలో చైనాపై ఎక్కువ
వ్యతిరేకత వున్నా ఆ దేశం వస్తువులు ఎక్కువగా అమ్మడానికి గల కారణాలు
పరిశీలించినట్లయితే సరసమైన ధరతో పాటు హై ఎండ్ టెక్నాలజీ కారణమని తెలుస్తుంది.
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చైనా వస్తువులపై
నిషేధించాలి ఆన్ లైన్ వేధికగా చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత
ప్రభుత్వం కొన్ని చైనా యాప్స్ పై నిషేధం కూడా విధించింది. అయితే ఆన్ లైన్
ఈ-కామర్స్ వేదికలైనా అమేజాన్, ఫ్లిప్ కార్టుల్లో వీటికి డిమాండ్ పెరుగుతోంది.
ముఖ్యంగా చైనా స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికారాలపై
వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఫెస్టివల్ సీజన్ 2020 సేల్
లో వీటినే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ వారం ప్రారంభంలో జరిగిన బిగ్ బిలియన్
డేస్(బీబీడీ) సేల్ లో రియల్ మీ ఫోన్లు విరివిగా అమ్ముడుపోయాయి. గత ఏడాదితో
పోలిస్తే ఈ ఏడాది రెండు రెట్లు ఎక్కువగా కొనుగోలు చేసినట్లు ఫ్లిప్ కార్ట్ సంస్థ
వెల్లడించింది. అయితే ఎన్ని ఫోన్లు విక్రయించారో అనేది మాత్రం ఆ సంస్థ చెప్పలేదు.
అమేజాన్ లోనూ అధికంగా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులనే వినియోగదారులు కొనుగోలు చేశారు.
ముఖ్యంగా వన్ ప్లస్, జియామీ బ్రాండ్లు అత్యధిక విక్రయాలు అందుకున్నాయి.
ఇవి కాకుండా చైనాకు చెందిన నాన్ బ్రాండ్ ఉత్పత్తులను కూడా ఎక్కువ విక్రయాలు
అందుకున్నాయి.
ప్రజల్లో చైనా పై
వ్యతిరేకత వున్నా చైనా ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయడానికి కారణమేంటి? కొనుగోలు
చేసేటప్పుడు జాతీయత ఎందుకు అమలులోకి రాలేదు? లాంటి ప్రశ్నలు అందరికి వస్తాయి. ఇందుకు ముఖ్యకారణం
సరసమైన ధరతో పాటు హై ఎండ్ టెక్నాలజీ. చైనీస్ ఉత్పత్తులకు వ్యతిరేక సెంటిమెంట్
ప్రజల్లో ఇంకా లోతుగా వెళ్లలేదని, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో సరసమైన ధరతో నాణ్యత విషయంలో
వినియోగదారులను ఆకర్షించాయని బ్రాండ్ కన్సెల్టెంట్ హరీష్ బిజూర్ తెలిపారు.
వస్తువుల ధర, నాణ్యత ముందు వస్తువు ఎక్కడి నుంచి వచ్చాయనే
విషయాన్ని వినియోగదారులు పట్టించుకోలేదని అన్నారు. అమేజాన్, ఫ్లిప్
కార్డు ఉత్పత్తుల సొంత దేశం ప్రస్తావించకుండా వస్తువులను ప్రదర్శించడానికి
ప్రభుత్వం వద్ద రాడార్ ఉందనేది ఆసక్తికరమైన విషయం. కానీ చైనా ఉత్పత్తులను బ్యాన్
చేయాలని ఈటెయిలర్లను భారత్ కోరలేదు. జాతీయవాదాన్ని రూస్ట్ చేస్తోన్న సమయంలో
కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు సమాచారం తెలుసుకునేలా మూలాన్ని హైలెట్
చేయాలనేది ఆలోచన. ఇక, ఫ్లిప్ కార్డు తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ముగించగా
అమేజాన్ మాత్రం అక్టోబరు 17న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ఓ నెల పాటు
పొడిగించింది. మన దేశంలో సెల్ ఫోన్ మరియు డిజిటల్ పరికరాల తయారీలు అందుబాటులో
లేనందువల్ల ఇది ముఖ్యకారణంగా చెప్పవచ్చు.