ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో రియల్మీ మరో సంచలనం
By: chandrasekar Tue, 18 Aug 2020 11:03 AM
రియల్‌మీ 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రూ.10,000 లోపు రెండు స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేయబోతోంది. రియల్‌మీ సీ సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రియల్‌మీ సీ1, రియల్‌మీ సీ2, రియల్‌మీ సీ3, రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్లను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో రెండు మొబైల్స్‌ను పరిచయం చేయబోతోంది.
రియల్‌మీ సీ12,
రియల్‌మీ సీ15 మోడల్స్‌ను ఆగస్ట్ 18న మధ్యాహ్నం
12.30 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ల ప్రత్యేకత. అంతేకాదు ధర కూడా రూ.10,000
లోపే ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్‌లో రియల్‌మీ సీ15 మోడల్ రిలీజైంది.
6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే,
13+8+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8
మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇండోనేషియా మార్కెట్‌లో 3జీబీ+64జీబీ, 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లు రిలీజ్ అయ్యాయి. మరి ఇండియాలో కూడా ఇవే స్పెసిఫికేషన్స్‌తో రియల్‌మీ సీ15 రిలీజ్ అవుతుందా లేక భారతీయ యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఏవైనా మార్పులు ఉంటాయా అన్నది చూడాలి.
ఇక రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి తెలియవు. 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ మాత్రం ఉంటుందని కంపెనీ ప్రకటించింది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఉండొచ్చని అంచనా. మరి రియల్‌మీ సీ12 స్పెసిఫికేషన్స్ తెలియాలంటే ఆగస్ట్ 18 వరకు వెయిట్ చేయాల్సి ఉంది.