రానా విరాటపర్వం నుంచి న్యూ లుక్ విడుదల
By: Sankar Mon, 14 Dec 2020 11:20 AM
టాలీవుడ్ భల్లాలదేవుడు రానా పుట్టినరోజు సందర్భంగా తానూ నటిస్తున్న కొత్త సినిమా విరాట పర్వం నుంచి కొత్త లుక్ ఒకటి విడుదల అయింది..రానా పోస్టర్‌తో పాటు అతడి పేరును కూడా విడుదల చేశారు.
ఈ సినిమాలో నక్సల్ నాయకుడు రవి అన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రానా తన సహచరులతో పాటు అడవిలో తెల్లటి మంచుతెరల్లో నల్లని తుపాకులు పట్టుకొని కనిపించారు. ఆ పోస్టర్‌లో రానా ఆలివ్ గ్రీన్ యూనిఫార్మ్‌లో ఉద్యమానికి నిలువెత్తు రూపంలా కనిపించాడు.
అయితే ఈ సినిమా పోస్టర్‌లో అన్ని సినిమాలలా కాకుండా సాయిపల్లవి పేరును మొదట రాసారు. పోస్టర్‌లో సాయి పల్లవి పేరు ముందుండాలని రానా ప్రత్యేకంగా చేయించాడని సాయి చెప్పింది. అంతేకాకుండా టైటిల్ కార్డులలో కూడా ఇదే తరహాలో ఉంటాయిని సమాచారం.
ఇక టాలీవుడ్ లో డిఫరెంట్ కథలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా ..బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించినా రానా ..పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు..