ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కలిసిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్
By: Sankar Mon, 07 Dec 2020 5:03 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిశారు. సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సోము వీర్రాజును శాలువాతో సత్కరించారు. సినీ నటి హేమ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా సోము వీర్రాజు గతంలో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా ఆయనతో సమావేశమయ్యారు...
ఇటీవలే రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ‘గాలి సంపత్’ అనే సినిమా ప్రారంభమైంది. శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు..
Tags :
meets |
ap |