కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ కు కరోనా పాజిటివ్...
By: Sankar Fri, 13 Nov 2020 07:25 AM
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కరోనాకు వారు వీరు అనే తేడా లేదు. ఎవరికైనా ఎలాగైనా సోకవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనాకు బలి కావాల్సి వస్తుంది.
ఇప్పటికే దేశంలో అనేకమంది రాజకీయ నాయకులు కరోనాబారిన పడ్డారు. కరోనా వైరస్ వల్ల బలయ్యారు. గల్లీ నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ యువనేత సచిన్ పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని.. ఆ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని సచిన్ పైలట్ సూచించారు. వైద్యుల సలహాలను పాటిస్తున్నానని, త్వరలోనే తాను కోలుకుంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.