ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో వర్షాలు...
By: chandrasekar Thu, 29 Oct 2020 6:08 PM
నైరుతి రుతుపవనాలు బలహీనపడిన
మరు క్షణమే తమిళనాడు రాష్ట్రాన్ని ఈశాన్య రుతుపవనాలు తాకాయి. తమిళనాడు, కేరళతో
పాటు దక్షిణ ద్వీపకల్ప ప్రాంతానికి ఈశాన్య రుతుపవనాలు వచ్చాయి.
ప్రస్తుతానికి ఈశాన్య
రుతుపవనాలు బలహీనంగా ఉన్నప్పటికీ త్వరలోనే బలపడే అవకాశం ఉందని వాతావరణ
శాఖ ప్రకటించింది. ఈ రుతుపవనాల రాక నేపథ్యంలో నేటి నుంచి డిసెంబర్ చివరి
నాటికి 44
సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా చెన్నై
వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలచంద్రన్ మాట్లాడుతూ.. దక్షిణ తమిళనాడుతో
పాటు తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. మధురై జిల్లాలోని మేలూరులో 6
సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
గత 24 గంటల్లో
ఇదే అత్యధిక వర్షపాతం అని ఆయన చెప్పారు. చెన్నై జిల్లాలోని నుంగంబక్కం, సోలింగనల్లూరులో
1
సెంటిమీటర్ వర్షపాతం నమోదైందని బాలచంద్రన్ తెలిపారు.