Advertisement

  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా రైల్వే ఉద్యోగులు, కార్మికులు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా రైల్వే ఉద్యోగులు, కార్మికులు

By: chandrasekar Thu, 26 Nov 2020 11:20 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా రైల్వే ఉద్యోగులు, కార్మికులు


జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా రైల్వే ఉద్యోగులు, కార్మికులు మద్దతు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి హెచ్.ఎం.ఎస్. కార్మిక సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీకి రైల్వే ఉద్యోగులు, కార్మికులు అండగా నిలవాలని హెచ్.ఎం.ఎస్., రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ ఉప కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ఇంచార్జీ శంకర్ రావు పిలుపునిచ్చారు.

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే కార్మిక సంఘం జాతీయ కీలక నాయకులు శంకర్ రావుతో బుధవారం సికింద్రాబాద్ లోని ఆయన నివాసంలో భేటి అయ్యారు. రైల్వేలో కీలక పాత్రను పోషిస్తున్న మజ్దూర్ యూనియన్, టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్న విషయాన్ని రైల్వే ఉద్యోగులు, కార్మికులకు తెలియజేయనుంది.

టీఆర్ఎస్‌కు వీరు మద్దతును ప్రకటించడం పట్ల వినోద్ కుమార్.. శంకర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీలో ఎంపీ బండ ప్రకాష్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు యాదవ రెడ్డి పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయాన్ని నమోదుచేస్తుందని అయన తెలిపారు.

Tags :

Advertisement