Advertisement

  • బీహార్ ఎలక్షన్స్...మహాకూటమి తప్పక విజయం సాధిస్తుంది..రాహుల్ గాంధీ

బీహార్ ఎలక్షన్స్...మహాకూటమి తప్పక విజయం సాధిస్తుంది..రాహుల్ గాంధీ

By: Sankar Wed, 04 Nov 2020 5:43 PM

బీహార్ ఎలక్షన్స్...మహాకూటమి తప్పక విజయం సాధిస్తుంది..రాహుల్ గాంధీ


బీహార్ ఎన్నికల్లో మూడో దశ ప్రచారం జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర కొన్ని పార్టీలు కలిసి మహాఘట్ బంధన్ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఎన్డీయేను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఈ కూటమి ప్రచారం చేస్తున్నది. దొరికి ఏ అవకాశాలన్నీ వదులుకోవడం లేదు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్డీయే కూటమిపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో రైతులు ఎక్కడికి వెళ్లైనా పంటను అమ్ముకోవచ్చని అంటున్నారని, రోడ్లు బాగుంటేనే కదా ఎక్కడికైనా వెళ్లి పంటను అమ్ముకునేదని అన్నారు.

బీహార్ లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని అన్నారు. ఇక ఎలక్ట్రానిక్ మెషిన్లను ఉద్దేశిస్తూ, అవి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కాదని, మోడీ ఓటింగ్ మెషిన్లు అని అన్నారు. రాష్ట్రంలో ఈవీఎంలు పెట్టినా, ఎంవీఎంలు పెట్టినా మహాకూటమి విజయం సాధించి తీరుతుందని అన్నారు రాహుల్ గాంధీ.

Tags :
|

Advertisement