Advertisement

  • భారత్ లో ఆ కారణం వల్లనే తక్కువ సంఖ్యలో కరోనా మరణాలు నమోదు అయితున్నాయి..

భారత్ లో ఆ కారణం వల్లనే తక్కువ సంఖ్యలో కరోనా మరణాలు నమోదు అయితున్నాయి..

By: Sankar Sun, 30 Aug 2020 08:18 AM

భారత్ లో ఆ కారణం వల్లనే తక్కువ సంఖ్యలో కరోనా మరణాలు నమోదు అయితున్నాయి..


కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు అన్ని అతలాకుతలం అయ్యాయి..ముఖ్యంగా యూరోప్ దేశాలు అమెరికా బాగా కరోనా దాటికి మరణాలను చవి చూశాయి..ఇండియాలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదు అయినప్పటికీ ఆ దేశాలతోపోలిస్తే మరణాల సంఖ్య చాల తక్కువగా ఉంది..అయితే ఇలా మరణాలు తక్కువగా ఉండటానికి గల కారణాలను కొంతమంది వైద్య పరిశోధకులు వివరించారు

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు పూర్తిగా మూసి ఉన్న ఏసీ గదుల్లో చాలా తక్కువ సమయం గడుపుతారు. ఇది ఆసియా దేశాల్లో కరోనా మరణాలు తక్కువ సంఖ్యలో నమోదుకావడానికి కారణం కావొచ్చు. ఐరోపా దేశాల్లో తొలినాళ్లలో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో అక్కడి వాతావరణం చల్లగా ఉండటంతో వారు ఎక్కువగా మూసిఉన్న గదులకే పరిమితమై ఉండి ఉండొచ్చు’ అని సర్‌ గంగారామ్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగం ఛైర్మన్‌ డాక్టర్‌ శ్యామ్ అగర్వాల్ అన్నారు.

అయితే, భారత్‌లో ఒకే ఇంట్లో ఎక్కువమంది నివసించడం వల్ల కుటుంబాల్లో వైరస్‌ వ్యాప్తికి దోహదం చేస్తుందన్నారు. మూసివేసి, పరిమిత ప్రదేశాలలోని గాలిలో వైరస్ ఉండి, వ్యాప్తికి దారితీస్తుంది. ఇది వైరల్ లోడ్‌ను మరింత పెంచుతుంది అని పేర్కొన్నారు. మరోవైపు, తగినంత గాలి, వెలుతురు లేని, ఇరుకు గదుల్లో వైరస్‌ భారినపడ్డ వ్యక్తులతో ఉండటం వల్ల గాలి ద్వారా కోవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ జులైలో హెచ్చరించింది. మూసి ఉన్న, పూర్తిగా ఏసీ ఏర్పాట్లు ఉన్న గదులకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు

Tags :
|

Advertisement