'దేవ్ దీపావళి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
By: chandrasekar Tue, 01 Dec 2020 12:18 PM
దేవ్ దీపావళి’
కార్యక్రమాన్ని ప్రధాని మోడీ
ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ తాను పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న
నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
సోమవారం, నవంబర్
30
సాయంత్రం వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయానికి వచ్చిన మోదీ అక్కడ ప్రత్యేక పూజలు
నిర్వహించారు. అనంతరం ‘దేవ్ దీపావళి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీపం వెలిగించి
‘దేవ్ దీపావళి’ ప్రారంభించారు. ఈ దీపాలు కనువిదు చేశాయి. వారణాసి ఘాట్లలో
వెలిగించిన దీపాలు అలరించాయి. అనంతరం గంగానదిలో ప్రధాని మోదీ పడవలో ప్రయాణించారు.
ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంతులు
వెదజల్లాయి.
ఈ పర్యటనలో భాగంగా
అంతకుముందు హందియా (ప్రయాగ్ రాజ్) - రాజతలాబ్ (వారణాసి) రహదారిని ప్రధాని మోదీ
జాతికి అంకితం చేశారు. జాతీయ రహదారి 19 విస్తరణలో భాగంగా ఈ రోడ్డును నిర్మించారు. ఈ
సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ‘హర్ హర్ మహదేవ్’ అంటూ ప్రసంగాన్ని
ప్రారంభించిన మోదీ అందరి దృష్టిని ఆకర్షించారు. గురు నానక్ జయంతి, దేవ్
దీపావళి సందర్భంగా వారణాసి మెరుగైన మౌలిక సదుపాయాలను పొందుతోందని మోదీ
పేర్కొన్నారు. నేడు ప్రారంభించిన రహదారి వల్ల వారణాసి, ప్రయాగ్‌రాజ్
రెండు ప్రాంతాలకు లాభం చేకూరుతుందన్నారు. రూ. 2,447 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ అలహాబాద్ -
వారణాసి మధ్య ప్రయాణ సమయాన్ని గంటకు తగ్గించనుంది. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం
కలగనున్నట్లు తెలిపారు.