Advertisement

  • హిందీలో ప్రభాస్ సూపర్ హిట్ సినిమా చత్రపతి...దర్శకుడు వి.వి వినాయక్...?

హిందీలో ప్రభాస్ సూపర్ హిట్ సినిమా చత్రపతి...దర్శకుడు వి.వి వినాయక్...?

By: chandrasekar Fri, 27 Nov 2020 4:03 PM

హిందీలో ప్రభాస్ సూపర్ హిట్ సినిమా చత్రపతి...దర్శకుడు వి.వి వినాయక్...?


బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ప్రభాస్ సూపర్ హిట్ సినిమా చత్రపతిని రీమేక్ చేస్తోన్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సాహోతో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తాడని టాక్ రాగా.. ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. ఆ ప్రాజెక్ట్ చేయట్లేదని ఆయనే స్వయంగా ప్రకటించారు. దీంతో దర్శకుడు ఎవరనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానంగా వి.వి వినాయక్ పేరు వినబడుతోంది. మాస్ సినిమాలు తీయడంలో వినాయక్ సిద్దహస్తుడు. శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’తో తెలుగులోకి పరిచయం చేసింది కూడా వినాయకే. ఆ చిత్రం మంచి విజయాన్ని కూడా అందించింది. అందుకే వినాయక్ ద్వారానే హిందీలోకి కూడ బెల్లంకొండ లాంఛ్ అవ్వాలని అనుకుంటున్నాడట.

అందులో భాగంగా ఈ చత్రపతి రీమేక్‌ను ఆయన చేతిలోని పెట్టానున్నారని అనిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక మరోవైపు వినాయక్ చిరంజీవితో చేయాల్సిన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కూడ ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేదు.

ఇక చత్రపతి సినిమా విషయానికి వస్తే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన యాక్షన్ డ్రామా ఛత్రపతి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ, అమ్మ సెంటిమెంట్ గానీ సినిమాలో మంచి కిక్‌ను ఇస్తాయి. చెప్పాలంటే ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచిన చిత్రం.

ఒకటిన్నర దశాబ్దం క్రితం తెలుగునాట సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కానుందని సమాచారం. ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కి అనుకూలంగా ఉండటం కోసం సెకండాఫ్‌లో ఛత్రపతి హిందీ రీమేక్ కథను కొంత మారుస్తున్నారని వినికిడి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది. మరి ఈ సినిమాలో బెల్లంకొండ ఎలా చేస్తాడో చూడాలి.

Tags :

Advertisement