కవితక్క గెలుపు ఖాయం: మహేష్ బిగాల
By: chandrasekar Sat, 10 Oct 2020 12:41 PM
నిజామాబాద్ స్థానిక సంస్థల
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ
మెజార్టీతో గెలవడం ఖాయమని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల
పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 824 ఓట్లు ఉండగా అందులో 90 శాతం
ఓట్లు కవితకే పడటం ఖాయమన్నారు.
కరోనా పాజిటివ్ ఉన్న 24 మంది
సభ్యులు కూడా వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారంటే కవితక్క గెలుపు ఖాయం అన్నారు. గత
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు, రైతులకు బాండు పేపర్లు రాసిచ్చి మోసం చేసిన వ్యక్తిని
గెలిపించి పొరపాటు చేశామని ఏడాది తర్వాత జిల్లా ప్రజలు గ్రహించారన్నారు.
అన్ని ఎన్నికల్లో విజయం
సాధించినట్టే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా
వక్త్యం చేసారు. కవితక్క గెలుపు నిజామాబాద్‌కి మళ్లీ పూర్వ వైభవాన్ని
తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.