Advertisement

  • తొలి డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ ప్రారంభం నేడే ..

తొలి డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ ప్రారంభం నేడే ..

By: Sankar Mon, 28 Dec 2020 09:30 AM

తొలి డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ ప్రారంభం నేడే ..


దేశంలో తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు నేడు పట్టాలెక్కనుంది. ఈ రైల్వే సర్వీసును సోమవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

దీంతో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఈ ఘనత దక్కించుకోనుంది. ఢిల్లీ మెట్రో కారిడార్‌లోని మెజెంటా లైన్‌లో జనక్‌పురి వెస్ట్‌-బొటానికల్‌ గార్డెన్‌లో మొత్తం 37 కిలోమీటర్ల మేర ఈ రైలు నడువనుంది.

2021 మధ్యనాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్‌ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డ్రైవర్‌ లేకుండా నడిచే రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7 శాతం మాత్రమే ఉన్నాయి. దేశంలో ఇదే మొదటి రైలు కావడం విశేషం.

Tags :
|
|

Advertisement