భారీ అగ్నిప్రమాదం నుంచి యజమానిని కాపాడిన రామ చిలుక...!
By: Anji Thu, 05 Nov 2020 05:51 AM
యజమానులను కాపాడటం కోసం పెంపుడు జంతువులు ధైర్య, సాహసాలు ప్రదర్శించిన కథనాల గురించి గతంలో మీరు చదివే ఉంటారు.
అయితే.. ఇప్పుడు చదవబోయేది కాస్త ఢెప్రెంట్ వార్త. ఓ రామచిలుకు తనను ఆప్యాయంగా పెంచుకుంటున్న వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరగగా.. యజమానిని ఆ చిలుక అలర్ట్ చేసింది.
చిట్టిపొట్టి మాటలతో అతడిని పిలుస్తూ.. నిద్ర లేపింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో బుధవారం (నవంబర్ 4) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆంటోన్ గుయేన్ అనే వ్యక్తి మంగళవారం (నవంబర్ 3) రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటి పెరడులో మంటలు చెలరేగాయి.
ఆ మంటలను గమనించిన పెంపుడు చిలుక.. యజమాని పేరును పదే పదే పలుకుతూ అలర్ట్ చేసింది. దీంతో గాఢ నిద్రలో ఉన్న ఆంటోన్ నిద్రలేచాడు.
ఆంటోన్ ఆందోళనగా బయటకొచ్చి చూడగా.. అప్పటికే ఆ ఇంటిని మంటలు చుట్టుముట్టాయి. వెంటనే అతడు ఇంటి నుంచి బయటకు పరుగెత్తుకొచ్చిన తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఆ తర్వాత ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
మంటలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అలారం మోగినా తనకు వినిపించలేదని ఆంటోన్ చెప్పాడు. తన పెంపుడు చిలుక అరుపులతో మెలకువ వచ్చిందని.. ఆ తర్వాత మెల్లిగా పొగ వాసన వచ్చిందని, ఏదో తగలబడుతున్నట్లు అనిపించిందని తెలిపాడు.
వెంటనే నిద్రలేచి వెనక డోర్ తెరిచి చూడగా పెద్ద మంటలతో తగలబడిపోతోందని వివరించాడు. తన పెంపుడు చిలుక అలర్ట్ చేసుండకపోతే ఏమై ఉండేవాన్నోనని ఆవేదన వ్యక్తం చేశాడు.