Paytm App మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ లోకి
By: chandrasekar Sat, 19 Sept 2020 07:33 AM
జూదానికి సంబంధించిన
కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై Paytm
App ను ప్లే స్టోర్ నుంచి శుక్రవారం తొలగించిన విషయం
తెలిసిందే. కొన్ని గంటల పాటు గూగుల్ ప్లే స్టోర్ నుండి వైదొలిగిన తరువాత, మొబైల్
వాలెట్ అప్లికేషన్ పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ మరోసారి తిరిగి అదే ప్లాట్‌ఫాంలోకి
వచ్చింది. Paytm అధికారిక ట్విట్టర్ ద్వారా శుక్రవారం సాయంత్రం దాని
గురించి సమాచారం ఇచ్చింది. ఇంతకుముందు, గూగుల్ ప్లే స్టోర్ గ్యాంబ్లింగ్ ఆరోపణలపై paytm యాప్ ను దాని ప్లాట్‌ఫాం నుంచి తొలగించింది. గూగుల్ ప్లే స్టోర్ గ్యాంబ్లింగ్
వంటి యాప్స్ కు మద్దతు ఇవ్వదని, జూదానికి సంబంధిత విధి విధానాలను ఉల్లంఘించినందుకు Paytm తొలగించామని తెలిపింది.
ప్రజలు తమ వాలెట్ లోని
డబ్బుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని
తెలిపింది. కొన్ని గంటల క్రితం, గూగుల్‌తో
ఈ సమస్యపై తాము పనిచేస్తున్నామని పేటీఎం వినియోగదారులకు హామీ ఇచ్చింది.
వినియోగదారుల యొక్క Paytm Wallet లో ఉన్న డబ్బు పూర్తిగా సురక్షితమని కూడా తెలిపింది.
ఇదిలా ఉంటే పేటీఎం ఇటీవల 'పేటీఎం క్రికెట్ లీగ్' ను ప్రారంభించింది.
ఇందులో క్రికెట్ పట్ల మక్కువ ఉన్న కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్‌బ్యాక్‌లను
గెలుచుకునేందుకు కొన్ని గేమ్స్ ను ఇందులో పొందుపరిచింది. దీని కింద, వినియోగదారులు
ప్రతి లావాదేవీకి ఆటగాళ్ల స్టిక్కర్లను స్వీకరిస్తారు. దాన్ని సేకరించిన తరువాత, వారికి
క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
పేటీఎం క్రికెట్ లీగ్
ప్రారంభించడంతో కాష్ బ్యాక్ గెలిచే విధానం కలిగించింది. జూదానికి సంబంధించిన
కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి
తొలగిస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం గూగుల్ వారికి తెలియజేసినట్లు పేటీఎం
తెలిపింది. ఈ కారణంగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్
మాయం అయ్యింది. అయితే ప్రస్తుతం Paytm
యాప్ నుండి క్యాష్‌బ్యాక్ భాగం తాత్కాలికంగా
తొలగించారు. Paytm నిబంధనల ప్రకారం Google
విధానాలను ఉల్లంఘించబడకుండా తమ యాప్ నుంచి క్యాష్‌బ్యాక్
భాగాన్ని తాత్కాలికంగా తొలగించామని తెలిపంది. దీంతో మళ్ళీ ప్లే స్టోర్ లో చోటు
చేసుకుంది.