Advertisement

  • పవన్‌కళ్యాణ్‌... ఓ సామాజిక చైతన్య దీప్తి - నేడు పుట్టినరోజు

పవన్‌కళ్యాణ్‌... ఓ సామాజిక చైతన్య దీప్తి - నేడు పుట్టినరోజు

By: Dimple Wed, 02 Sept 2020 00:47 AM

పవన్‌కళ్యాణ్‌... ఓ సామాజిక చైతన్య దీప్తి - నేడు పుట్టినరోజు

కోట్లకు కోట్లు సంపాదించిపెట్టే సినిమా రంగం... కావాల్సినంత కాదు... ఊహించనంత సంపదను సృష్టించుకునే సినిమా రంగంలో రాణిస్తున్న తరుణంలో మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో యువరాజ్యం బాధ్యతలను చూసుకునే ప్రయత్నం చేశాడు. సినిమాల్లో నటిస్తూ... రాజకీయాల్లో కొనసాగుదామనే భావనతో రాజకీయాలవైపు మనసు మార్చుకున్న పవన్‌ కళ్యాణ్‌... రాజకీయాల్లో అన్న పెట్టిన పార్టీ ప్రజారాజ్యంకు ప్రజాశ్శీర్వాదం కరువైంది. 2009 ఎన్నికల్లో 18 సీట్లకే పరిమితమైంది. అనుకున్నట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం లేకపోవడంతో... వైఎస్‌ రాజశేఖరెడ్డి మరణానంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌ పార్టీలో విలీనమైంది.

ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌.... రాజకీయాలపై మనసు విరిగిపోయింది. సమాజం పట్ల తపన... ప్రజలకు చేరువకావాలనే భావన.. ఇలా నలిగిపోతూ మౌనం వహించాడు.. తదనంతర పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగింది. రాజకీయ పార్టీల అరాచకాన్ని కళ్లారా చూసిన పవన్‌ మనస్తాపానికి గురయ్యాడు. జనసేన పేరుతో రాజకీయపార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ధామని నిశ్చయించుకున్నాడు.

2014 ఎన్నికల్లో రాజకీయ పార్టీగా పురుడు పోసుకున్న జనసేన ఎన్నికల్లో పోటీ పడదని ప్రకటించి... రాజకీయాల్లో అనుభవంగల చంద్రబాబునాయుడి నాయకత్వానికి మద్దతు ప్రకటించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌నుంచి వేరుపడిన నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ అధికారం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. నైతికంగా మద్దతు ఇస్తున్నానే తప్ప.... రాజకీయ ప్రయోజనాలు.... ఆర్థిక సాయం వంటివి తనకు అవసరం లేదని బహిరంగంగానే ప్రకటించాడు.

రాజకీయ పార్టీల వ్యవహారశైలి... అవినీతి... అక్రమాలు... రగిలిపోయిన పవన్‌ కళ్యాణ్‌... తనవంతు బాధ్యతగా ప్రశ్నించాలని చాలా సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. ప్రత్యేకంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన ఉద్యమం చేపట్టాలని భావించిన పవన్‌ కళ్యాణ్‌... మెత్తబడ్డారు. ఆ తర్వాత పరిణామాలతో కేంద్రంలో బీజేపీతోనూ... రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీతోనూ విభేదించి.. 2019 ఎన్నికల్లో పోటీకి దిగాడు. ఎన్నికల ఫలితాలు బెడిసి కొట్టాయి. ప్రతిపక్షంలోనే జనసేన జనం గళం వినిపిస్తొందని శపధం చేశారు. దీంతో ఓ వైపు సినిమాలు... మరో వైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నపవన్‌... సమాజం పట్ల... ప్రజలపట్ల ప్రత్యేక అభిప్రాయంతో ఉన్నారు.
జనాన్ని మభ్యపెట్టడం మంచిదికాదు... ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకుని జనంకోసం... జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే భావనతో ఉన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ బయోగ్రఫీ టూకీగా...

pawankalyan,birthday,special ,పవన్‌కళ్యాణ్‌... ఓ సామాజిక చైతన్య దీప్తి - నేడు పుట్టినరోజు

పేరు - కళ్యాణ్‌ బాబు
పుట్టింది - బాపట్ల, గుంటూరుజిల్లా
పుట్టిన తేది, 1971 సెప్టెంబరు 2,
అమ్మ- అంజనీదేవి, నాన్న- వెంకట్రావు, కానిస్టేబుల్‌
అన్నయ్యలు ఇద్దరు - మెగాస్టార్‌ చిరంజీవి, నాగేంద్రబాబు
చిన్నపుడే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ, కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌
అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయం
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో సినిమా రూపకల్పన
తొలిసినిమాకు మామ అల్లు అరవింద్‌ నిర్మాణసారథ్యం
1996 అక్టోబరు 11 తేదిన తొలిసినిమా విడుదల
ఇప్పటిదాకా 25 సినిమాల్లో నటన
తెలుగు ప్రజల్లో కోట్లమంది అభిమానం సంపాదించుకున్న పవన్‌
1998లో తొలిప్రేమ సినిమాతో ఓ సంచలన విజయం
జాతీయ అవార్డుతోపాటు... నంది అవార్డులు సొంతం
తొలిప్రేమ, బద్రీ, ఖుషీ, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికిదారేది సినిమాలతో ఊహించని విజయం
2008లో ప్రజారాజ్యం పార్టీలో యురాజ్యం అధ్యక్షుడుగా పవన్‌
2009 ఎన్నికల ప్రచారంలో రాజకీయనాయకులపై మాటల తూటాలు
ఎన్నికల అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత మనస్తాపం
రాజకీపరిణామాలు... తెలుగురాష్ట్రాల విభజనతో చలించిపోయిన పవన్‌
2014 మార్చి 14న స్వతహాగా జనసేన పేరుతో రాజకీయపార్టీ స్థాపన
రాజకీయాల్లోనూ... సినిమాల్లోనూ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్థానం
సామాజికాంశాలపై సందర్భోచితంగా పోరాటం
ఉద్ధానం సమస్యపై చలనం తీసుకొచ్చిన పవన్‌
రాజధాని రైతులకు అండగా ప్రభుత్వానికి హెచ్చరిక
కడప ఫాతిమా కళాశాల విద్యార్థుల భవితపై ప్రభుత్వానికి ప్రశ్న
అమరావతి రాజధానిపై ప్రజల భావోద్వేగంతో చెలగాటం వద్దని ప్రభుత్వానికి సూచన
జనాన్ని మభ్యపెట్టడం మంచిదికాదు... ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకుని జనంకోసం... జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే భావనతో ఉన్నారు.

Tags :

Advertisement