Advertisement

  • పవన్ కళ్యాణ్ బాడీగార్డ్ 'దాస్ చేతన్' కామెర్ల వ్యాధితో కన్నుమూత

పవన్ కళ్యాణ్ బాడీగార్డ్ 'దాస్ చేతన్' కామెర్ల వ్యాధితో కన్నుమూత

By: chandrasekar Mon, 15 June 2020 11:39 AM

పవన్ కళ్యాణ్ బాడీగార్డ్ 'దాస్ చేతన్' కామెర్ల వ్యాధితో కన్నుమూత


పవన్ కళ్యాణ్ దగ్గర చాలా ఏళ్లుగా పని చేస్తున్న దాస్ చేతన్ కామెర్ల వ్యాధితో కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. బాడీగార్డ్స్ అంటే కేవలం నెల జీతానికి పని చేసే వాళ్లు కాదు. తమ ప్రాణాలను అడ్డుపెట్టి జీతం ఇచ్చే వాళ్ల కోసం జీవితం ఇచ్చేవాళ్లు. అందుకే చాలా మంది తమ కోసం పని చేసే వాళ్లను పనివాళ్లుగా కాకుండా తమ వాళ్లుగా చూస్తుంటారు. బాలీవుడ్‌లో కూడా సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లు తమ బాడీగార్డ్స్‌కు కోట్ల రూపాయలు ఇస్తుంటారు. వాళ్ల కోసం ఏదైనా చేస్తుంటారు. అలాంటి అద్భుతమైన బాడీగార్డ్ ఒకరు ఇప్పుడు చనిపోయాడు. ఎప్పుడూ తన వెన్నంటే ఉండే బాడీగార్డు ఇలా హఠాత్తుగా కన్నుమూయడంతో పవన్ కళ్యాణ్ చాలా బాధ పడుతున్నాడు.

ఎన్నో ఏళ్లుగా పవన్ దగ్గరే పని చేస్తున్నాడు చేతన్. ఈయన వయసు 47 సంవత్సరాలు మాత్రమే. గతంలో తమిళ హీరో సూర్యకి విజయ్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలకు బాడీగార్డ్‌గా పని చేశాడు దాస్ చేతన్. ఈయనది కేరళ రాష్ట్రానికి చెందినవాడు. కొన్నేళ్లుగా పవన్ దగ్గర పని చేస్తున్న ఈయన కొన్ని రోజులుగా కామెర్ల వ్యాధితో బాధపడ్డాడు. కేరళలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈయన మరణ వార్త తెలుసుకున్న స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. పవన్ కూడా ఈ విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయాడు.

Tags :

Advertisement