బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
By: chandrasekar Mon, 12 Oct 2020 6:04 PM
పశ్చిమ బంగాళాఖాతంలో
వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖపట్నంకు
ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, నర్సాపూర్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 360
కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం రాగల 12
గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా
ప్రయాణించి నర్సాపూర్, విశాఖపట్నం మధ్య కాకినాడకు మధ్యలో మంగళవారం తెల్లవారు
జామున తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
ఈ సమయంలో గాలుల తీవ్రత
గంటకు 50 నుంచి
75కిలోమీటర్ల
వేగంతో ఉండవచ్చని తెలిపింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని
పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
మెదక్, సిద్దిపేట, గద్వాల జోగులాంబ, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు
కురిశాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్
అర్బల్, రూరల్, కొత్తగూడెం
సహా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.