చట్టం ప్రకారం పనిచేసే అధికారులను అడ్డుకోలేము: సుప్రీంకోర్టు
By: chandrasekar Sat, 20 June 2020 4:11 PM
పార్లమెంట్ భవన
నిర్మాణం కోసం కొత్తగా చేపడుతున్న ప్రతిపాదిత సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను
అడ్డుకోలేమని ఇవాళ సుప్రీంకోర్టు వెల్లడించింది. చట్టం ప్రకారం పనులు
చేస్తున్న వారిని అడ్డుకోలేమని కోర్టు
తేల్చి చెప్పింది. ప్రాజెక్టు క్లియరెన్స్ విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని
ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెమతా అత్యున్నత న్యాయస్థానానికి
తెలియజేశారు.
సెంట్రల్ విస్టా కేసును
జస్టిస్ ఏఎం ఖన్‌విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజివ్ ఖన్నాలతో కూడిన
అధికారవర్గం విచారించింది. 20వేల కోట్ల ప్రాజెక్టుకు అక్రమ అనుమతులు ఇచ్చినట్లు
రాజీవ్ సూరి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును సుప్రీం ధర్మాసనం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.
కోర్టులో కేసు పెండింగ్‌లో
ఉన్నా ప్రభుత్వం యదేచ్ఛగా అనుమతులు ఇస్తున్నట్లు పిటిషనర్ వాదించారు. చట్టం
ప్రకారం పనిచేసే అధికారులను అడ్డుకోగలమా అని ఈ సందర్భంగా జస్టిస్ ఖన్‌విల్కర్ తెలిపారు. అయితే
గ్రౌండ్ వర్క్ ఆపాలంటూ వేసిన పిటిషన్‌పై
స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.