చెన్నైలో ఎన్టీఆర్, చరణ్...
By: chandrasekar Mon, 30 Nov 2020 5:57 PM
ప్రస్తుతం చెన్నైలో
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ చక్కర్లు కొడుతున్నారు. ఆర్ఆర్ఆర్
షెడ్యూల్ తో బిజీగా ఉండాల్సిన ఈ ఇద్దరు హీరోలు చెన్నైలో ఏం చేస్తున్నారంటూ
అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ వీళ్లు ఏం చేస్తున్నారనే దానిపై అప్
డేట్ ఒక విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్, చరణ్ తమ తమ వ్యక్తిగత పనుల కోసం చెన్నైకి
వెళ్లినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఆట్లీతో కథా చర్చల్లో భాగంగా ఎన్టీఆర్
చెన్నైలో ఉండగా మరోవైపు ఉపాసన కామినేని తల్లి శోభన 60వ
పుట్టినరోజు వేడుకల కోసం చరణ్ చెన్నై వెళ్లాడట.
ఉపాసన సోదరి, ఇతర
కుటుంబసభ్యులతో కలిసి గెట్ టు గెదర్ పార్టీలో పాల్గొననున్నారు. రామ్ చరణ్
ఇప్పటికే ఆచార్య చిత్రంలో స్పెషల్ రోల్ లో నటించేందుకు రాజమౌళి అనుమతి కూడా
తీసుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్
తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు తారక్.