ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) లో పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్
By: chandrasekar Mon, 16 Nov 2020 8:35 PM
ఇందిరా గాంధీ నేషనల్
ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) లో పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదలచేసింది.
నిరుద్యోగులకు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు
ప్రకటించింది. అసిస్టెంట్ రిజిస్టర్, సెక్యూరిటీ పోస్ట్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు INGOU తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22
పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు సూచించిన విధంగా దరఖాస్తు
చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాల కోసం
దరఖాస్తులకు ఆఖరు తేదీగా డిసెంబర్ 10 అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన
అభ్యర్థులు 10 డిసెంబర్ 2020 తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఏదైనా ఓ
సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. పీజీలో కనీసం 55 శాతం
మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుకు దరఖాస్తు
చేసే అభ్యర్థులు నవంబర్ 15 నాటికి 42 ఏళ్లు లేదా అంతకన్నా తక్కువ వయస్సు కలిగిన వారై
ఉండాలి.
ఇక సెక్యూరిటీ ఆఫీసర్ (SO)
కోసం ఏదైనా ఓ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్
పూర్తి చేసిన వారై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు సాధించన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ
పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు నవంబర్ 15 నాటికి 42 ఏళ్లు లేదా అంతకన్నా తక్కువ వయస్సు కలిగిన వారై
ఉండాలి. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తేదీ: 15 నవంబర్,
2020. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ: 10
డిసెంబర్ 2020. పోస్టుల సంఖ్య మొత్తం 22. అసిస్టెంట్ రిజిస్ట్రార్
21 మరియు
సెక్యూరిటీ ఆఫీసర్ కు 1 వుంది. దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని
సూచించారు.