కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ముందంజలో ఉండటం గర్వ కారణం ...గవర్నర్ తమిళి సై
By: Sankar Mon, 28 Dec 2020 8:47 PM
కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ముందంజలో ఉండటం గర్వకారణమని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. భారత్ బయోటెక్‌ను సందర్శించి ప్రధాని మోదీ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తున్న శాస్త్రవేత్తల్లో ఉత్తేజం నింపారని ఆమె పేర్కొన్నారు. విదేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
కరోనా కొత్త స్ట్రెయిన్‌తో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రజల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో వ్యవహరించాలని సూచించారు.
వ్యాక్సిన్ తయారీకి రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్న శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానని గవర్నర్ తమిళిసై అన్నారు. కరోనాపై పలువురు నెటిజన్లు ట్విటర్‌లో అడిగి ప్రశ్నలకు సోమవారం ఆమె సమాధానం ఇచ్చారు..కాగా బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది..బ్రిటన్ నుంచి ఎవరెవరు గత కొంతకాలంగా తెలంగాణ వచ్చారో అన్న విషయంపై ఆరా తీస్తుంది..