సిడ్నీ లో టెస్ట్ జరుగుతుంది ..క్లారిటీ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా
By: Sankar Sun, 20 Dec 2020 5:29 PM
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) స్పష్టం చేసింది. సిడ్నీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో మూడో టెస్టు వేదికలో మార్పులు చేయాలని సీఏ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్టు యథావిధిగా జరుగుతుందని, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని సీఏ ఆదివారం వెల్లడించింది. జనవరి 7 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తుండగా.. ఆఖరిదైన నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జనవరి 15 నుంచి మొదలవనుంది.
కాగా ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ అడిలైడ్ లో పింక్ బాల్ తో జరుగగా టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది...ఇక తొలి టెస్ట్ తర్వాత కోహ్లీ స్వదేశానికి రానుండగా , తర్వాత మూడు టెస్టులకు రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు...