నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ
By: chandrasekar Tue, 16 June 2020 11:42 AM
తెలంగాణలో మూడో ఎమ్మెల్యే
కరోనా వైరస్ బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కోవిడ్
సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో
కాంటాక్ట్ కావడంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. బాజిరెడ్డి
గోవర్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలగా ఆయన ఆదివారం హాస్పిటల్‌లో చేరారు.
నేరుగా కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లారు.
అంతకు ముందు జనగామ
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనతో కాంటాక్ట్ కావడం
వల్లే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు కోవిడ్ సోకింది. తాజాగా గణేష్ గుప్తాకు కరోనా
సోకడంతో తెలంగాణలో కోవిడ్ బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకి చేరింది. నిజామాబాద్
రూరల్ ఎమ్మెల్యేతో కాంటాక్ట్ కావడంతో పెద్ద సంఖ్యలో అధికారులు, జాప్రతినిధులు
హోం క్వారంటైనల్లోకి వెళ్లారు. ఆయన భార్యకు కూడా కోవిడ్ టెస్టులు చేయగా నెగటివ్
అని రిపోర్ట్ వచ్చింది. జనగామ ఎమ్మెల్యే భార్య, వంట మనిషి, కారు డ్రైవర్, గన్‌మెన్‌కు కూడా కరోనా సోకింది.
ఆరోగ్య శాఖ మంత్రి ఈటల
రాజేందర్ ఓఎస్డీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. మంత్రి హరీశ్
రావు వ్యక్తిగత సహాయకుడికి, మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కూడా కోవిడ్
నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటికే భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు
కరోనా బారిన పడ్డారు.