Advertisement

నిజామాబాద్ ఎంపీ మ‌రో వివాదాస్ప‌ద క‌మెంట్...

By: chandrasekar Wed, 09 Dec 2020 3:18 PM

నిజామాబాద్ ఎంపీ మ‌రో వివాదాస్ప‌ద క‌మెంట్...


కేంద్రం తెచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకిస్తూ రైతులు చేస్తున్న నిర‌స‌న‌ల‌పై అర‌వింద్‌ స్పందిస్తూ రైతుల‌ను బ్రోక‌ర్లుగా పేర్కొని వివాదాన్ని రేపారు. యూపీఏ హ‌యాంలో మ‌ధ్య ద‌ళారి వ్య‌వ‌స్థ‌ను తీసేయాల్సిందిగా నిజ‌మైన రైతులు కోరారు.

నేడు మోదీ ప్ర‌భుత్వం తెచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను బ్రోక‌ర్లు ఢిల్లీలో, తెలంగాణ‌లో నిర‌స‌న‌లు తెలుపుతూ వ్య‌తిరేకతను తెలుపుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అర‌వింద్‌ మీడియాతో మాట్లాడుతూ ...కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు పెద్ద మొత్తంలో లాభాలను చేకూర్చేందుకు ఉద్దేశించినవని ఆయన పేర్కొన్నారు. రైతులు స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నందున వ్యాప్తి చెందుతున్న భయాల్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్న‌ట్లు చెప్పారు. నూత‌న‌ చట్టాల ప్రకారం, రైతులు పెట్టుబడి పెట్టడం, బీమా ప్రీమియం చెల్లించడం లేదా వారి ఉత్పత్తుల అమ్మ‌కం గురించి ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రైతులకు పెట్టుబడి, బీమా ప్రీమియం, మార్కెట్ ధరను కూడా చెల్లించాల్సిన బాధ్యత కార్పొరేట్ సంస్థలదే అని చెప్పారు.

Tags :
|

Advertisement