నిజామాబాదు స్థానిక ఎమ్యెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ ఖరారు
By: Sankar Sat, 26 Sept 2020 06:50 AM
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యింది. అక్టోబర్ 9న ఉపఎన్నిక జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక 12వ తేదీన కౌంటింగ్ చేస్తారు. అయితే ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చినా కరోనా కారణంగా పోలింగ్ వాయిదా పడింది.
భూపతిరెడ్డిపై అనర్హత వేటుతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను ముందే ఖరారు చేశారు పార్టీలు. టీఆర్‌ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మొత్తానికి కరోనా కారణంగా వాయిదా పడ్డ నిజామాబాద్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మె ల్సీని ఎన్నుకోనున్నారు.