దుబాయిలో తెలుగు వాసి అరెస్ట్
By: Sankar Sun, 15 Nov 2020 2:23 PM
నిజామాబాదు జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన తాళ్ల ప్రభాకర్ అనే వలస కూలీని షార్జా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
కరోనా ప్రభావంతో ప్రభాకర్ పని చేస్తున్న కంపెనీలో వేతనాలు లేక కనీసం భోజనం సైతం లేక బయట మరో చోట పనులు చేసుకుంటున్నాడు. అయితే పాస్ పోర్టు, కంపెనీ వీసాలో సరైన వివరాలు చెప్పకుండా బయట తిరుగుతున్నాడనే అభియోగాలపై షార్జా పోలీసలు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు గల్ఫ్ వెల్ఫేర్ కల్చరల్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డిని కలిసి ప్రభాకర్‌ను విడిపించాలని కోరారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రభాకర్‌ను విడిపించి తమ స్వగ్రామానికి చేరేలా చూడాలని బసంత్‌రెడ్డిని కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
Tags :
arrested |
dubai |