దేశ రాష్ట్రాల్లోని న్యూస్ హైలైట్స్
By: chandrasekar Mon, 20 July 2020 6:17 PM
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా
నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,650కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 5041 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 56 మంది
కరోనా వల్ల మరణించారు.
చైనీస్ కంపెనీ మొబైల్
యాప్ టిక్ టాక్ ఓ ఎత్తు వేస్తున్నట్టు తెలుస్తోంది. తమ హెడ్ క్వార్టర్‌ను చైనా
నుంచి యునైటెడ్ కింగ్ డమ్‌కు మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎన్డీటీవీ
కథనాన్ని రాసింది.
తెలంగాణలో కొత్త
సెక్రటేరియట్ భవనం డిజైన్ మారనుంది. గతంలో రిలీజ్ చేసిన డిజైన్‌లో ప్రభుత్వం
కొన్ని మార్పులు చేయనుంది. సీఎం కె.చంద్రశేఖర్ రావు కొన్ని సూచనలు చేశారు.
మార్పులు, చేర్పులు
సూచించారు.
రాష్ట్రంలోని రెండు
కీలకమైన ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమ, మంగళశవారాల్లో
విస్తృతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మద్యాహ్నం రెండు గంటల
నుంచి నీటి పారుదల శాఖ, మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆర్ అండ్ బి శాఖ
మంత్రులు, ముఖ్య
అధికారులతో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు
సచివాలయం పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది
శాఖ అధికారులు ప్రకటించారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై త్వరలో
మళ్లీ వెళ్లడిస్తామని తెలిపారు.
హైదరాబాద్‌కు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కాంలో లింకులు ఉన్నట్టు ఎన్ఐఏ
అనుమానం వ్యక్తం చేస్తోంది. గోల్డ్ హవాలాలో నగదు చెల్లింపులు హైదరాబాద్ లో
జరిగినట్లు కష్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా డబ్బును
హైదరాబాద్ నుంచి దుబాయ్ కి తరలించినట్లు ఆధారాలు లభించినట్టు తెలిసింది.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో
బంగారంలో పెట్టుబడులు సురక్షితమైన పెట్టుబడులుగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే
బంగారంలో పెట్టుబడులు అనగానే మనకు గుర్తుకు వచ్చేది కేవలం నగలు కొనుగోలు చేయడం
మాత్రమే కాదు. ప్రస్తుతం డిజిటల్ రూపంలో కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు.
కరోనా వైరస్ లాక్ డౌన్
కారణంగా మూతపడిన స్కూళ్లను మళ్లీ తెరిచే అంశంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు
కీలక సూచనలు చేసింది. రాష్ట్రాల్లో స్కూళ్లు రీ ఓపెన్ చేసేముందు విద్యార్థుల
తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రభుత్వాలకు కేంద్ర మానవ వనరుల శాఖ
కార్యదర్శి రాష్ట్రాలకు లేఖ రాశారు.