కర్ణాటకలో నూతన సంవత్సర వేడుకల రద్దు.. జనవరి 2 వరకు నైట్ కర్ఫ్యూ..
By: chandrasekar Wed, 23 Dec 2020 9:21 PM
కరోనా వ్యాప్తి ఇప్పడు
మళ్ళీ మొదలుకావడంతో ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేప్పటింది.
ఇందులో భాగంగా కర్ణాటకలో నూతన సంవత్సర వేడుకలను నిషేధించడం మరియు పాఠశాలలను తిరిగి
తెరవడంపై ఈ రోజు సంప్రదింపులు జరిగాయి. ఈ సంప్రదింపులకు ముఖ్య మంత్రి యెడియూరప్ప, ఆరోగ్య
మంత్రి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సంప్రదింపుల తరువాత ముఖ్య
మంత్రి యెడియూరప్ప విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇందుకోసం ఈ రోజు నుండి జనవరి 2 వరకు
కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి సమయాల్లో అంటే 10 గంటల
నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. నైట్ కర్ఫ్యూ
అమల్లో ఉన్నందున ప్రజలు దీనికి సహకరించాలని, ప్రజలు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన
కోరారు.
Tags :
new year |
canceled |