కొత్త వైరస్ ఎఫెక్ట్ ..దేశంలో పలు రాష్ట్రాలలో న్యూ ఇయర్ వేడుకలు రద్దు
By: Sankar Tue, 29 Dec 2020 1:05 PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది అని భావిస్తున్న తరుణంలో బ్రిటన్ లో మరొక కొత్త వైరస్ పురుడు పోసుకుంది...ఇది బ్రిటన్ నుంచి మెల్లగా ప్రపంచంలోని ఇతర దేశాలకు పాకుతుంది..కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాల దేశాలు జాగ్రత్తలు వహించినప్పటికీ కొత్త వైరస్ ఇతర దేశాలలోకి పాకింది..తాజాగా ఇండియాలో కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ కేసులు ఆరు నమోదు అయ్యాయి..
దీనితో మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంవత్సర వేడుకలకు ముందు మార్గదర్శకాలను ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 నుంచి జనవరి 5వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించింది. ముంబై, పుణెతో పాటు పెద్ద నగరాల్లోనూ బహిరంగ నూతన వేడుకలకు అనుమతించడం లేదు. కర్ణాటకలోనూ గురువారం సాయంత్రం 6గంటల నుంచి 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడంతో పాటు క్లబ్‌లు, పబ్‌లు, రెస్టారెంట్‌లతో పెద్ద ఎత్తున సమావేశాలపై జనవరి 2వ తేదీ వరకు నిషేధం విధించారు.
తమిళనాడులో క్లబ్, పబ్‌లు, బీచ్ రిసార్ట్స్, రెస్టారెండ్లు, బీచ్‌లలో న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ను ప్రభుత్వం నిషేధించింది. రెస్టారెంట్లు, పబ్‌లు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా.. కొవిడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మెరీనా బీచ్ న్యూ ఇయర్ సందర్భంగా మూసివేసింది. పంబాబ్‌లోనూ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. వివాహాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు, సామూహిక సామావేశాలపై నిషేధం విధించింది.