నైజీరియాలో మరో రకం కరోనా వైరస్ కలకలం
By: Sankar Thu, 24 Dec 2020 10:11 PM
ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభవుతుండగా మరోవైపు కొత్త రకం కరోనా వైరస్‌లు ఆందోళన రేపుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, దక్షిణ ఆఫ్రికాలో రెండు కొత్త రకాల కరోనా వైరస్ ఉత్పరివర్తనలు వెలుగులోకి రాగా, తాజాగా నైజీరియాలో మరో రకం కరోనా వైరస్‌ను గుర్తించారు.
దీనిపై మరింతగా దర్యాప్తు జరుగుతున్నదని ఆఫ్రికాకు చెందిన ఉన్నత వైద్య అధికారులు తెలిపారు. బ్రిటన్, దక్షిణ ఆఫ్రికాలో గుర్తించిన కొత్త రకాల కరోనా కంటే ఈ పరివర్తన వైరస్ భిన్నంగా ఉన్నదని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధిపతి జాన్ న్కెన్గాసోంగ్ తెలిపారు.
నైజీరియా సీడీసీ, ఆఫ్రికన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జెనోమిక్స్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కలిసి మరిన్ని నమూనాలను విశ్లేషిస్తున్నాయని చెప్పారు.