తనకు తాను క్షమాభిక్ష పెట్టుకునే సందర్భం అమెరికా చరిత్రలో ఎదురవ్వలేదు…!
By: chandrasekar Mon, 16 Nov 2020 10:55 AM
జనవరి 20న
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన ట్రంప్ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవాల్సి ఉన్నది.
పదవీకాలంలో ఆయనపై పన్ను ఎగవేత ఆరోపణలతో పలు న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి.
ఇప్పటివరకూ అధ్యక్షుడిగా ఉండటం వల్ల ట్రంప్‌పై చర్యలు తీసుకోవడానికి న్యాయపరమైన
అడ్డంకులు ఉండేవి. ప్రస్తుతం పదవి కోల్పోతున్న నేపథ్యంలో ట్రంప్ పరిస్థితి
ఏమిటన్నది చర్చనీయాంశమైంది. ఎటువంటి కేసుల్లోనైనా తనను తాను క్షమించుకునే (పార్డన్
మై సెల్ఫ్) అధికారాలు అధ్యక్షుడి హోదాలో తనకున్నాయని ట్రంప్ రెండేండ్ల కిందట ఓ
సందర్భంలో చెప్పారు. ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించిన వారి శిక్షలను రద్దు చేసే
అధికారం అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి ఉంటుంది. అయితే ఇది ఫెడరల్
నేరాలకు మాత్రమే పరిమితం. రాష్ట్రాల్లో నేరాలకు
వర్తించదు. దీంతో ట్రంప్ భావించినట్టు తనను తానే క్షమించుకొని శిక్షల
నుంచి తప్పించుకొనే అవకాశం తక్కువే అని న్యాయనిపుణులు అ౦టున్నారు. అధ్యక్షుడు తనకు
తాను క్షమాభిక్ష పెట్టుకునే సందర్భం అమెరికా చరిత్రలో ఇప్పటివరకూ ఎదురవ్వలేదు.
కేసుల నుంచి
తప్పించుకోవడానికి ట్రంప్ తన అధ్యక్ష పదవికి తాత్కాలికంగా రాజీనామా చేసి, ఉపాధ్యక్షుడిగా
ఉన్న మైక్ పెన్స్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా చేయాలి. ట్రంప్‌పై ఉన్న కేసులను
పెన్స్.. ‘ప్రెసిడెన్షియల్ పార్డన్' సాయంతో రద్దు చేస్తారు. అమెరికా రాజ్యాంగంలోని 25వ చట్ట
సవరణ దీనికి అవకాశం కల్పిస్తుందని న్యాయని పుణులు చెప్తున్నారు. ఎన్నికల్లో
అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ మద్దతుదారులు చేపట్టిన ‘మిలియన్ మెగా మార్చ్' హింసాత్మకంగా
మారింది. వాషింగ్టన్‌లో ర్యాలీ తీస్తున్న ట్రంప్ మద్దతుదారులకు, ప్రత్యర్థి
వర్గం ఎదురుకావడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఎన్నికల తర్వాత ట్రంప్ తొలిసారి
బైడెన్ గెలుపును ఒప్పుకున్నాడు. ‘ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే బైడెన్ గెలిచాడు’
అని ఆదివారం ట్రంప్ ట్వీట్ చేశారు.