21 రోజుల ఐసొలేషన్ తర్వాత నటి జెనీలియాకు నెగటివ్ రిపోర్ట్
By: chandrasekar Mon, 31 Aug 2020 10:57 AM
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజు రోజుకు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ ప్రముఖ సినీ నటి జెనీలియా కీలక ప్రకటన చేసింది. మూడు వారాల క్రితం తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. అయితే 21
రోజుల ఐసొలేషన్ తర్వాత శనివారం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ఇన్‌స్టాగ్రమ్‌లో వెల్లడించింది. గత 21
రోజులుగా తనలో కోవిడ్ లక్షణాలేవీ కనిపించలేదని దేవుడి దయతో ఇవాళ కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని చాలా సంతోషాన్ని వెలిబుచ్చింది.
భయంకర వ్యాధిగా భావిస్తున్న కరోనాను జయించడం ఇంత సులభమని తాను ముందుగా భావించలేదన్న జెనీలియా గడచిన 21 రోజుల ఒంటరి జీవితం తనకు సవాల్‌గా మారిందని అంగీకరిస్తున్నట్లు తెలిపింది. మూడు వారాల విరామం తర్వాత తన కుటుంబ సభ్యుల మధ్యకు రావడం సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంది. కరోనా మహమ్మారిని జయించాలంటే ముందుగా గుర్తించడం, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం, ఫిట్‌నెస్‌తో ఉండటం ఎంతో ముఖ్యమని సూచించింది. దీని విషయంలో తాను చక్కగా జాగ్రత్తలు తీసికోవడం వల్ల తొందరగా బయట పడ్డట్టు తెలిపారు.
జెనీలియా భర్త రితీష్ విలాస్రావ్ దేశ్ముఖ్ సినీ నటుడు, నిర్మాత అయిన అతను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్రావ్ దేశ్ముఖ్ కుమారుడు. రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న జెనీలియాకు ఇద్దరు కుమారులు రియాన్, రహైల్ ఉన్నారు. బాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య ఆస్పత్రిలో ఉండి కోలుకున్నారు. అనుపం ఖేత్ తల్లి, సోదరుడు, కోడలుకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. గత వారం తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనా ఎవ్వరిని వాడాలి పెట్టడంలేదు. ఇటు సామాన్య ప్రజల నుండి అటు రాజకీయ నాయకులూ, సినీ ప్రముఖుల వరకు అందరిని దాని బారిన పడేటట్లు చేసింది.