తొలి స్థానమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్
By: Sankar Sun, 11 Oct 2020 2:07 PM
ఐపీఎల్ 2020లో ఆదివారం రెండు కీలక మ్యాచ్‌లు జరగబోతున్నాయి. మరి కొద్ది గంటల్లో సన్‌రైజర్స్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో.. పంజాబ్‌పై కోల్‌కతా, చెన్నైపై బెంగళూరు విజయం సాధించాయి. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండే సన్‌రైజర్స్ ఐదో స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలిస్తే.. పాయింట్ల పట్టికలో తిరిగి మూడోస్థానాన్ని సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతానికి కోల్‌కతా, బెంగళూరు కంటే ఆరెంజ్ ఆర్మీకే రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఒకవేళ రాజస్థాన్ విజయం సాధిస్తే మాత్రం.. చెన్నైను వెనక్కి నెట్టి ఆరోస్థానానికి చేరుకుంటుంది.
ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 8 పాయింట్ల చొప్పున సాధించాయి. కానీ మెరుగైన రన్ రేట్ కారణంగా ముంబై రెండో స్థానంలో, కోల్‌కతా మూడో స్థానంలో ఉన్నాయి.
ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై ఘన విజయం సాధిస్తే.. రన్ రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే మాత్రం తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.