రియా చక్రవర్తి సోదరుడు సోవిక్ చక్రవర్తి కి బెయిల్ మంజూరు
By: Sankar Wed, 02 Dec 2020 4:37 PM
దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా చక్రవర్తికి అక్టోబర్‌లో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తికి కూడా ముంబై స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్ మంజురూ చేసింది.
అయితే సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసులో రియా, ఆమె సోదరుడు సోవిక్, సుశాంత్ ఇంటి మెనేజర్ శామ్యూల్ మిరాండాతో పాటు పలువురిని సెప్టెంబర్ 4న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
రియా, ఆమె సోదరుడు సోవిక్‌కు డ్రగ్ ప్లెడర్‌లతో సంబంధాలు ఉన్నాయని వారు సుశాంత్‌కు డ్రగ్ కూడా సప్లై చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్‌సీబీ అధికారులు వెల్లడించడంతో వారిని ముంబై హైకోర్టు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో రియా, సోవిక్‌లు బెయిల్ కోరుతూ సెప్టంబర్ చివరి వారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు