Advertisement

  • బాలీవుడ్ లో డ్రగ్ వ్యవహారాలపై గళం ఎత్తిన నటుడు , ఎంపీ రవి కిషన్

బాలీవుడ్ లో డ్రగ్ వ్యవహారాలపై గళం ఎత్తిన నటుడు , ఎంపీ రవి కిషన్

By: Sankar Mon, 14 Sept 2020 5:32 PM

బాలీవుడ్ లో డ్రగ్ వ్యవహారాలపై గళం ఎత్తిన నటుడు , ఎంపీ రవి కిషన్


డ్రగ్స్‌ కేసుతో బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలపై నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ గళమెత్తారు. బాలీవుడ్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్‌, పంజాబ్‌ ద్వారా దేశంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్ట్‌ చేసి, ఎన్‌సీబీ మంచి పనిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, కేసుతో సంబంధం ఉన్న మిగిలిన దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు. పొరుగు దేశాల కుట్రకు శుభం కార్డు వేయాలన్నారు..

Tags :
|

Advertisement