Advertisement

  • ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఎంపీ కోమటిరెడ్డి...

ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఎంపీ కోమటిరెడ్డి...

By: Sankar Tue, 15 Sept 2020 08:11 AM

ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఎంపీ కోమటిరెడ్డి...


ఎల్‌ఆర్‌ఎస్‌ ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది.. కరోనా సమయంలో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌పై.. కరోనా కంటే ఎక్కువ చర్చ సాగుతోంది.. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... ఎల్‌ఆర్‌ఎస్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైన ఎంపీ కోమటిరెడ్డి.. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నష్టాలపాలు అవుతారు.. ఎప్పుడో తీసుకున్న స్థలానికి మళ్ళీ డబ్బులు కట్టలేరని వివరిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కోమటిరెడ్డి పిటిషన్‌ వేశారు.

ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన మరియు ఆమోదించబడని లేఅవుట్లను నిరోధించడానికి ప్రభుత్వ నియమాలు నిబంధనలను జారీ చేసింది.. కానీ, పేద, మధ్య తరగతి ప్రజలు వారి తప్పు లేకున్న భారీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్య ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు వారి కష్టపడి సంపాదించినవి.. ఇప్పుడు వారిపై ఇంత భారీ జరిమానా విధించడం ఏంటి? అని ప్రశ్నించారు.

ఎప్పుడో కొన్న ప్లాట్ యొక్క కొనుగోలు ధరలో దాదాపు సగం మళ్లీ కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ కోమటిరెడ్డి.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక వేల ఎకరాల భూములు వెంచర్లుగా మారాయి.. సుమారు 3-5 లక్షల ప్లాట్లు అమ్ముడయ్యాయి.. అవి అన్ని చట్టవిరుద్ధమని ప్రకటించబడ్డాయన్నారు. కానీ, అనుమతి లేని లే అవుట్లకు పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులదే అన్నారు కోమటిరెడ్డి.. అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందన్న ఆయన.. అధికారులు పాటించని తప్పుకు సామాన్య ప్రజలపై భారీ జరిమానా విధించడం సరికాదన్నారు..

సాధారణ ప్రజల భూములను రిజిస్ట్రేషన్ చేయడాన్ని నిషేధించే నిబంధనలు 2020 జారీ చేయడం రిజిస్ట్రేషన్ చట్టానికే విరుద్ధమని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ.. చట్టాలను పాటించకుండా అటువంటి అనుమతులు మంజూరు చేసిన అప్పటి అధికారులపై చర్య తీసుకోవాలన్న ఆయన.. ఎలాంటి జరిమానా ఛార్జీలు మరియు రిజిస్ట్రేషన్లను ఆపకుండా రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు.

Tags :
|
|

Advertisement