నేడు, రేపు భారీ వర్షాలు...!
By: Anji Mon, 21 Sept 2020 08:07 AM
రాష్ట్రానికి వరుణుడి ముప్పు పోలేదు. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కోన్నారు.
Tags :
rains |