Advertisement

  • అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో వైసీపీ ఫై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఎమ్మెల్యే...

అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో వైసీపీ ఫై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఎమ్మెల్యే...

By: chandrasekar Mon, 30 Nov 2020 12:46 PM

అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో వైసీపీ ఫై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఎమ్మెల్యే...


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. ఐదు రోజుల పాటూ ఈసారి సెషన్స్ నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. సోమవారం ఉదయం జరిగే బీఏసీ సమావేశంలో దీనిపై పూర్తి వివరాలు తెలియనుండగా ప్రతిపక్షం టీడీపీ మాత్రం కనీసం 10 రోజులైనా నిర్వహంచాలని డిమాండ్ చేస్తోంది.

అలాగే ప్రశ్నోత్తరాలు కూడా ఉండాలని కోరుతోంది. ఇటు జగన్ సర్కార్ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లుల్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇటు ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలపై సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు పేల్చారు. నేడు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయని.. వైఎస్సార్‌సీపీ వారు ఈ సారికి ఎప్పుడు తెచ్చేవి కాకుండా మాస్కులు పెట్టుకు రండి అన్నారు.

ఇది ప్రజలు అందరికీ క్షేమకరం అని తెలిపారు. భజన చేసే తాళాలు.. ఆ పక్కన మాస్కు ఫోటోను ఉంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకుని రావాలని పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు వదిలారు.

Tags :
|
|
|

Advertisement