బండారు దత్తాత్రేయ కు తప్పిన కారు ప్రమాదం
By: chandrasekar Mon, 14 Dec 2020 3:46 PM
బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ నుండి సూర్యాపేటకు పర్యటన వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం
అయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బండారు దత్తాత్రేయ ప్రమాదం నుంచి తృటిలో
తప్పించుకున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఎసిపి సత్తయ్య మరియు ఇన్స్పెక్టర్ వెంకన్న లు సంఘటనా స్థలానికి
చేరుకుని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధిచిన వివరాలు తెలుసుకున్నారు.
ఆయన ప్రయాణిస్తున్న వాహనం
హైదరాబాద్ మరియు విజయవాడ జాతీయ రహదారి పై నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం
ప్రాంతంలో అదుపు తప్పి రహదారి పక్కనున్న చెట్టు దగ్గరికి దూసుకెళ్లింది. ప్రమాద
సమయంలో ఆయనతో బాటు వ్యక్తిగత సహాయకుడు కూడా వున్నాడు. వీరితో బాటు కారు నడుపుతున్న
డ్రైవర్ కూడా వెంట వున్నారు. ఈ ప్రమాదంలో దత్తాత్రేయ సహాయ సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో అతనిని చికిత్స కోసం
హైదరాబాద్ లో హాస్పిటల్ కు తరలించారు. అనంతరం దత్తాత్రేయ వేరే వాహనంలో తన పర్యటన
కోసం బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.