ఎన్నికయిన కార్పొరేటర్లతో భేటీ అయిన మంత్రి కేటీఆర్
By: Sankar Sun, 06 Dec 2020 6:11 PM
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో గ్రేటర్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించారు.
అనంతరం ఎన్నికల్లో గెలిచిన కార్పోరేటర్లతో సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మేయర్ పీఠంపై కార్పోరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు...
ప్రజల్లో తిరిగి.. ప్రజల్లోనే ఉండాలని వారికి సూచించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై కసరత్తులు చేశారు. ఎంఐఎంతో పొత్తు లేకుండానే పీఠం దక్కించుకునేలా టీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం పార్టీ పెద్దలు జీహెచ్‌ఎంసీ చట్టాలను పరిశీలిస్తున్నారు.
Tags :
meeting |
winning |