పరిశుభ్రమయిన నీటిని తెలంగాణ ప్రజలకు అందించేందుకే ఆ కార్యక్రమం ..ఎర్రబెల్లి
By: Sankar Fri, 18 Dec 2020 10:32 PM
స్వచ్చమైన, పరిశుభ్రం చేిన ఆరోగ్యవంతమైన మంచినీటిని తెలంగాణ ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పధకాన్ని ప్రారంభించారని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
46వేల కోట్ల వ్యయంతో మొదలు పెట్టి 34 వేల కోట్లు ఖర్చుచేసి 99శాతం గ్రామాలకు మంచినీటిని కేవలం రెండేళ్లలో అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. వరంగల్ మహానగర పరిధిలోని హసన్‌పర్తి, భిమారం,లో మిషన్‌భగీరథ మానిటరింగ్ సెల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు..
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరధ వల్ల నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ దాదాపు తగ్గిపోయిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. ప్రతి రోజూ ప్రతి పౌరుడికి తాగునీటిని అందిస్తున్నామన్నారు. వరంగల్ మహానగరంలో 47.50 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసిన నీటిని, మరో 117 మి.లీ. శుద్ధిచేయని నీటిని అందిస్తున్నట్టు తెలిపారు.