వర్ణ వివక్ష గురించి మాట్లాడుతూ ఏడ్చిన మైకేల్ హోల్డింగ్ ..
By: Sankar Fri, 10 July 2020 2:36 PM
అమెరికాలో నల్ల జాతీయుడు అయినా జార్జి ఫ్లాయిడ్ ను పోలీసులు హత్యా చేసిన తర్వాత ప్రపంచం మొత్తం తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి ..నల్ల జాతీయుల మీద తరాలుగా జరుగుతున్న వర్ణ వివక్ష మీద అందరూ గళం విప్పారు ..సెలెబ్రిటీలు నుంచి సామాన్యులు వరకు అందరు దీనికి మద్దతు తెలిపారు ..సౌదర్య ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో వైట్ అనే పదాన్ని తొలగించాయి ..
అయితే తాజాగా వెస్ట్ ఇండీస్ దిగ్గజ ఆటగాడు మైకేల్ హోల్డింగ్ వర్ణ వివక్ష గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యాడు .. వర్ణవివక్షపై మాట్లాడుతూ ఏడ్చేశారు. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య సౌతాంప్టన్‌లో టెస్టు మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు కామెంట్రీ ఇస్తున్న సమయంలో మైఖేల్ హోల్డింగ్ వర్ణవివక్షపై భావోద్వేగంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వర్ణవివక్ష గురించి వివరంగా చర్చించారు.
నల్లజాతీయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన వివరించారు. తమ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్న సమయంలో.. మైఖేల్ హోల్డింగ్ ఏడ్చేశారు. భర్త నల్లగా ఉన్న కారణంగా.. తన తల్లితో ఇంట్లోవాళ్లు మాట్లాడేవారు కాదు అని హోల్డింగ్ గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టాడు. కనీసం ఇప్పుడైన నల్లజాతీయుల్ని గుర్తిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.