Advertisement

మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్

By: Sankar Wed, 16 Sept 2020 1:02 PM

మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్


తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరొక ప్రముఖ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది..ఇప్పటికే లెజండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి వారు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్పుడు క‌రోనా మెగా ఫ్యామిలీ మీద క‌న్నేసింది. నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ అయింది. అయితే దీనికి గురించి నాగ‌బాబు నోరు విప్ప‌క‌ముందే రెండు రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

ఇప్పుడు ట్విట‌ర్ వేధిక‌గా నాగ‌బాబు విష‌యాన్ని వెల్ల‌డించారు. తొంద‌ర‌గా క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే నాగ‌బాబు గ‌త కొన్నిరోజులుగా ఓ ఛాన‌ల్‌లో వ‌చ్చే కామెడీ షోలో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. బ‌హుశా అక్క‌డి నుంచే వైర‌స్ సోకి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నాగ‌బాబు సూచించారు. నాగ‌బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అత‌ని అభిమానులు రీట్వీట్లు పెడుతున్నారు.

కాగా మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు..తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన చిన్నపాటి ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు..సుస్వాగతం సినిమా టైం లో బాలయ్య బాబు తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు

Tags :
|

Advertisement